కేంద్రంలో అధికారంలో బీజేపీ వ్యూహాలు రాజకీయ ఎత్తుగడలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో ఎవరికీ అర్ధం కావడం లేదు. గతం కంటే భిన్నంగా మోదీ నాయకత్వంలోని కమలనాథులు రాజకీయం చేస్తున్నారు. దేశం మొత్తం కాషాయం రంగు నింపేయడమే లక్ష్యంగా బీజీపీ ముందుకెళుతుంది. కేంద్రంతో పాటు ప్రతి రాష్ట్రంలోనూ అధికారంలో ఉండాలనే ఉద్దేశంతో కమలం పార్టీ వాళ్ళు పనిచేస్తున్నారు.