ఏపీలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలకు కొత్త ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 8న ఎన్నికలు జరగనుండగా, 10న కౌంటింగ్ జరగనుంది. ఏపీలోని 653 జెడ్పీటీసీ, 10,047 ఎంపీటీసీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఏపీలో పరిషత్ ఎన్నికలకు సంబంధించి గతేడాది మార్చి 7న నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్లు కూడా స్వీకరించారు.