మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు...వయసు పెరిగేకొద్ది దూకుడు ప్రదర్శిస్తున్న నాయకుడు. దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో రాజకీయాలు చేస్తున్న అయ్యన్న, అధికార వైసీపీ అంటే చాలు ఒంటికాలి మీద వెళ్తారు. టీడీపీలో ఎవరు మాట్లాడినా, మాట్లాడకపోయినా అయ్యన్న మాత్రం జగన్పై విమర్శలు చేస్తూనే ఉంటారు. అలాగే వైసీపీ నేతలపై విరుచుకుపడుతుంటారు. తాజాగా అయ్యన్న, మంత్రి పేర్ని నానిపై విరుచుకుపడ్డారు.