ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ గడ్డు పరిస్థితులని ఎదురుకుంటున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లోనే జగన్ దెబ్బకు టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది. ఇక ఆ తర్వాత నుంచి టీడీపీ పెద్దగా పుంజుకోలేదని అర్ధమవుతుంది. చంద్రబాబు ఎంతసేపు జగన్ని తిట్టడం తప్పా, పార్టీని పైకి తీసుకొద్దామనే ఆలోచన చేయలేదు. అందుకే పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది.