ఏపీలో జరగనున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకుంటే, టీడీపీ కార్యకర్తలు షాకింగ్ నిర్ణయం తీసుకునేలా ఉన్నారు. ఊహించని విధంగా చంద్రబాబు, పరిషత్ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా టీడీపీ అభ్యర్ధులు పోటీలో ఉండటం అనివార్యమే.