సాక్షాత్తూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ కల్యాణ్ సీఎం అవుతారని క్రెడిట్ ఇచ్చారని, ఇక పవన్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడమే తరువాయి అని సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. మరికొంతమంది బీజేజీ నాయకులు కూడా పవన్ మాత్రమే సీఎం పోస్ట్ కి అర్హుడంటూ వత్తాసు పలికారు. కానీ తిరుపతిలో అసలా ఊసే లేదు. తిరుపతి ప్రచారానికి పవన్ ని తీసుకొచ్చేందుకు కాస్త ఆవేశపడిన బీజేపీ నాయకులు ఆ తర్వాత తీరిగ్గా నాలుక కరచుకున్నారు. ఇప్పటినుంచే పవన్ కి లేనిపోని బిల్డప్ ఇవ్వడం ఎందుకని సైలెంట్ అయ్యారు. అదే నిజమైతే తిరుపతి బహిరంగ సభలో అందరి ముందు ఆ మాట బయటకు రావాల్సింది. కానీ ఎవ్వరూ నోరు మెదపలేదు.