గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని దూకుడు కొనసాగుతుంది. ఇటీవలే పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటిన నాని, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ దిశగా వెళుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఎన్నికలని బహిష్కరించినట్లు ప్రకటించింది. ఇక ఈ ప్రకటన నానికి బాగా కలిసిరానుంది. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ ఇంకా బలంగానే ఉంది. కొడాలి నాని వైసీపీ వైపుకు వెళ్ళినా సరే, పలు గ్రామాల్లో టీడీపీ కేడర్ చెక్కు చెదరలేదు.