టీడీపీ ఎంపీ కేశినేని నాని...మొన్నటివరకు విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన నాయకుడు. సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేసిన నేత. ఎప్పుడు దూకుడుగా ఉండే కేశినేని, రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే విజయవాడలో రెండోసారి ఎంపీగా గెలిచారు. ఇక ఇలా గెలవడం వల్లే అనుకుంటా, నానికి మరింత దూకుడు పెరిగింది. ముందు నుంచి ప్రత్యర్ధి పార్టీపై ఎలాంటి విమర్శలు చేశారో, అంతే స్థాయిలో సొంత పార్టీ నేతలపైన విమర్శలు చేస్తూ వచ్చారు.