ఈ లేఖ షర్మిలకూ చాలా సంతోషం కలిగించేలా ఉంది. తెలంగాణలో పార్టీ ఏర్పాటు విషయాన్ని విజయమ్మ సమర్థిస్తున్నట్టే కనిపిస్తోంది. షర్మిలమ్మ తన రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉందని గట్టిగా నమ్మిందని.. తెలంగాణ ప్రజలతో తన అనుబంధాన్ని దేవుడు ఆనాడే రాశాడని షర్మిల నమ్ముతోందని.. కాబట్టే షర్మిలమ్మ తెలంగాణలో ముందడుగు వేస్తోందని విజయమ్మ లేఖలో తెలిపారు.