రఫెల్ కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని గత కొంత కాలంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు సత్యమని ఈ కథనంతో రుజువైందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మోదీ ఇప్పుడు దేశానికి ఏ సమాధానం చెబుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సూర్జేవాలా ప్రశ్నిస్తున్నారు.