చిత్తూరు జిల్లా...టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా. అవ్వడానికి బాబు సొంత జిల్లా అయినా సరే...ఇక్కడ డామినేషన్ మొత్తం వైసీపీదే. రాష్ట్రంలో టీడీపీ గాలి ఉన్న 2014 ఎన్నికలు కావొచ్చు, జగన్ వేవ్ ఉన్న 2019 ఎన్నికలు కావొచ్చు...చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. 2014లో జిల్లాలో టీడీపీ 6 సీట్లు గెలుచుకుంటే, వైసీపీ 8 గెలుచుకుంది.