ఏపీలో బీజేపీకి ఉన్న బలమెంత? అంటే ఆ పార్టీకి నోటా కంటే ఎక్కువ ఓట్లు పడవు అనే సమాధానాలే ఎక్కువ వస్తాయి. ఎందుకంటే 2019 ఎన్నికల్లో బీజేపీకి అలాగే ఓట్లు పడ్డాయి. ఆ పార్టీ కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేదు. ఇలా ఒక్కశాతం ఓట్లు కూడా రాకపోయినా సరే, కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో బీజేపీ నేతల చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పైగా జనసేనతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో ఎదగాలని బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది.