కోవిడ్ టీకా తీసుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి, ప్రజల్ని ప్రోత్సాహించడం కోసం గుజరాత్ స్వర్ణకార సంఘం వినూత్న ఆలోచన చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న మహిళలకు బంగారు ముక్కుపుడక.. మగ వారికి హ్యాండ్ బ్లెండర్ అనే వస్తువుని బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. కేవలం ప్రకటనతో సరిపెట్టడం కాదు, నిజంగా చేసి చూపించారు కూడా.