జగన్ బెయిల్ త్వరలోనే రద్దవబోతోందన్న ప్రచారం జోరందుకుంది. మొన్న ఓ బీజేపీ నేత ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ జగన్ బెయిల్ ఏ క్షణంలో అయినా రద్దు అవుతుందని అనడం రాజకీయంగా కలకలం సృష్టించింది. తాజాగా వైసీపీ నుంచి దూరంగా ఉంటున్న ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ వరుస పరిణామాలు చూస్తే జగన్కు వ్యతిరేకంగా ఏమైనా పథకం సిద్ధమవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.