ప్రత్యేక హోదా...గత కొన్నేళ్లుగా ఏపీ రాజకీయాల్లో నలుగుతున్న అతి పెద్ద టాపిక్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రకు అప్పటి యూపిఏ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చి, రాష్ట్రాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. ఐదేళ్ల పాటు హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే, కాదు లేదు అని బీజేపీలోని కీలక నాయకులు అంటే వెంకయ్య నాయుడు లాంటి వారు పదేళ్ళ పాటు హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఏపీకి 10 ఏళ్ల పాటు హోదా వస్తుందని అంతా అనుకున్నారు.