తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోరులో వైసీపీ-టీడీపీలు నువ్వా-నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉండటంతో గెలవడానికి మంచి స్కోప్ ఉంది. పైగా తిరుపతిలో టీడీపీ పెద్దగా గెలిచిన దాఖలాలు లేవు. దీనికి తోడు టీడీపీ ఇటీవల జరిగిన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.