ఏపీ రాజకీయాల్లో మూడో శక్తిగా ఎదిగేందుకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ప్రయత్నిస్తుందా? అంటే ప్రస్తుతానికైతే ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఎందుకంటే ఏపీలో వైసీపీ, టీడీపీలు బాగా బలంగా ఉన్నాయి. ప్రస్తుతం అధికార వైసీపీ తిరుగులేని శక్తిగా ఉంది. ఆ తర్వాత టీడీపీకి కూడా ఎక్కువ బలం ఉందనే చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సరే టీడీపీకి చెక్కు చెదరని ఓటు బ్యాంక్ ఉంది.