తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నడుస్తోంది. ఓ వైపు అధికార పార్టీ భారీ మెజారిటీతో గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తుంటే, ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అదిరిపోయే విజయం సొంతం చేసుకోవాలని టీడీపీ చూస్తుంది. ఇక ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టి సత్తా చాటాలని బీజేపీ అనుకుంటుంది. అయితే జనసేనతో పొత్తులో పోటీ చేస్తున్న బీజేపీకి తిరుపతిలో పెద్ద సీన్ లేదనే చెప్పొచ్చు. కాబట్టి బీజేపీని పక్కనబెడితే వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ నడవనుంది.