ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అధికార వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుంది. 2019 ఎన్నికల్లోనే అదిరిపోయే విజయాలని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చిన వైసీపీ, రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉంది. ఇక ప్రతిపక్ష టీడీపీ పరిస్తితి రోజురోజుకూ దిగజారిపోతుంది. రెండేళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు కష్టాల్లో ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఎంత కష్టపడినా, టీడీపీని బలోపేతం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకా ప్రజలు జగన్నే గట్టిగా నమ్ముతున్నారు.