తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో జనసేన ఓటర్లు కీలకంగా కానున్నారా? అంటే ప్రస్తుతానికైతే పెద్ద కీలకం కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆ పార్టీ విజయం దాదాపు ఖాయమని ప్రచారం జరుగుతుంది. ఇక ఇక్కడ వైసీపీ భారీ మెజారిటీ కోసం ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఇక వైసీపీ తర్వాత టీడీపీకి గట్టిగానే ఓట్లు పడతాయని విశ్లేషణలు వస్తున్నాయి.