ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ అర్ధం కాదు. ఏ పార్టీ ఏ పార్టీకి పరోక్షంగా మద్ధతు ఇస్తుందో తెలియదు. అసలు ఏపీలో వైసీపీ-టీడీపీలు ప్రధాన శత్రువులుగా ఉన్న విషయం తెలిసిందే. అటు బీజేపీ-జనసేనలు మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఇదే సమయంలో బీజేపీ పరోక్షంగా వైసీపీకి మద్ధతుగా ఉందనే విమర్శలు ఎప్పటినుంచో వస్తున్నాయి. అలాగే జనసేన ఇన్‌డైరక్ట్‌గా టీడీపీకి సపోర్ట్ అనే వాదనలు కూడా ఉన్నాయి.