తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ప్రచారంలో టీడీపీ దూకుడు పెంచింది. అధికార వైసీపీని దెబ్బతీసి తిరుపతిలో గెలిచేందుకు టీడీపీ నేతలు గట్టిగా కష్టపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రధాన నాయకులంతా తిరుపతికి వచ్చేశారు. అలాగే నారా లోకేష్ ఇంటింటికి తిరుగుతూ పనబాక లక్ష్మీని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. అటు చంద్రబాబు రోడ్‌షోలు చేస్తున్నారు. ఇలా టీడీపీ నేతలంతా కలిసికట్టుగా తిరుపతిలో ప్రచారం చేస్తున్నారు.