ఏపీలో అనేక ట్విస్టుల మధ్య పరిషత్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో 60 శాతం వరకే పోలింగ్ నమోదైంది. అయితే 2014లో 80 శాతం పైనే పోలింగ్ శాతం నమోదైంది. కానీ ఈ సారి పల్లె జనం ఓట్లు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపినట్లు కనిపించ లేదు. ఎన్నికలు జరగడంపై అనేక ట్విస్టులు రావడంతో జనం ఓట్ల పండగని లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సైతం ఎన్నికలని బహిష్కరించడంతో, ఆ పార్టీకి ఉన్న ఓటర్లు, ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపినట్లు లేరు.