ఏపీలో ఎన్నికల హడావిడి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటివరకు పంచాయితీ, మున్సిపల్ సమరం జరగగా, తాజాగా పరిషత్ ఎన్నికల పోరు జరిగింది. ఇక ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. అయితే ఈ ఎన్నికల హడావిడిలో రాష్ట్రంలో ఉన్న కొన్ని సమస్యలు హైలైట్ అవ్వడం తగ్గినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎప్పటినుంచో అమరావతి కోసం రైతులు ఉద్యమం చేస్తున్నారు.