ప్రకాశం జిల్లా చీరాలలో మళ్లీ రాజకీయాలు మారుతున్నాయి. ఇక్కడ తలెత్తిన రాజకీయ మార్పుల నేపథ్యంలో మళ్లీ..మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు.. యువ నేత ఆమంచి కృష్ణమోహన్‌కు ఎడ్జ్ మరింత పెరుగుతుండడం గమనార్హం. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు వరకు వరుస విజయాలు దక్కించుకున్న ఆమంచి చీరాలలో బలమైన మాస్ నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే.. గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన ఆయన అనూహ్యంగా ఓడిపోయారు. ఇక, టీడీపీ తరఫున ఇక్కడ గెలిచిన కరణం బలరాం.. వైసీపీలోకి వచ్చారు. ఇక, వచ్చినప్పటి నుంచి ఆయన దూకుడు రాజకీయాలు చేశారు.