ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసీపీ హవా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ వైసీపీ వేవ్ ఉందని ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి. అయితే ఇంత భారీ ఆధిక్యంలో ఉన్న వైసీపీని దెబ్బకొట్టడం చాలా కష్టమైపోతుంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ హవా తగ్గించడం, చంద్రబాబు వల్ల కావడం లేదు. జగన్ సీఎం పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి బాబు గట్టిగానే వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అలాగే రాజకీయంగా ప్రతి అంశంలోనూ పోరాడుతున్నారు.