కిందపడిన పై చేయి మాదే అంటున్నారు టీడీపీ నేతలు, కార్యకర్తలు. పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ...మళ్ళీ అయిదేళ్లలోనే ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైపోయింది. జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి, అద్భుతమైన సంక్షేమ పాలనతో దూసుకెళుతున్నారు. ఇక జగన్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా కూడా జనం ఇంకా వైసీపీ పక్షానే ఉన్నారని, తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు రుజువు చేశాయి.