మాకు 25కు 25 ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ 2019 ఎన్నికల ముందు తెగ ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేసిన ప్రచారాన్ని దాదాపు సక్సెస్ చేస్తూ, ఏపీ ప్రజలు 25కి 22 మంది ఎంపీలని గెలిపించారు. ఇక చిన్న మెజారిటీలతో ముగ్గురు టీడీపీ ఎంపీలు విజయం సాధించారు. ఇదే సమయంలో కేంద్రంలో బీజేపీ కూడా భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ప్లీజ్, ప్లీజ్ హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగటం తప్పా, మనం ఏమి చేయలేమని జగన్ మొదట్లోనే తేల్చేశారు.