గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం తమిరశ గ్రామంలో మద్యం దుకాణాల్లో అధిక ధరలకు లిక్కర్ సేల్ చేస్తున్నారు. ఈ విషయమై కస్టమర్లు ప్రశ్నించగా.. రేటు పెరిగింది. ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు అని సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారు. తమిరశ మద్యపానం దుకాణంలో ఒక్క బాటిల్ పై రూ.40 తేడా ఉంది. దీనితో అధిక ధరలపై ఒక వినియోగదారుడు ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది. దీంతో వినియోగదారుడు అధిక ధరల విషయం గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించిన ఎక్సైజ్ అధికారులు దాడుల చేసి సొంతంగా తయారు చేసిన 9 వేల ఎమ్మార్పీ స్టిక్కర్లు కనుగొన్నారు. దీంతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.