ఏపీ రాజధానికి సంబంధించిన నిర్మాణానికి కావలసిన భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందని అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ నొక్కి వక్కాణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో ఎటువంటి అవినీతి జరగలేదని చంద్రబాబు తో సహా టీడీపీ నాయకులంతా కూడా వాదించారు. ఈ విషయంపై అప్పట్లోనే కేసులు వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయంపై కోర్టులు ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.