తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల పర్వం కొనసాగుతూ ఉంది. రెండు రోజులలో అది కాస్తా పూర్తవుతుంది. నిన్నటితో ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు ఎన్నికలో మరో కోణం ఓటర్లకు డబ్బు పంపిణీ విషయంపై అందరి దృష్టి నెలకొంది. ఈ డబ్బు పంపిణీ కార్యక్రమం చట్ట పరంగా కరెక్ట్ కాకపోయినా ఎప్పటి నుండో ఈ పద్ధతి సాగుతూ ఉంది.