ఏపీలోనూ క్రమంగా కరోనా విజృంభిస్తోంది. నిన్న ఏకంగా ఒక్కరోజే 5 వేల కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ఏపీ సర్కారు అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో రెండో దఫా కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను తక్షణమే పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.