ఎన్టీఆర్ సుబ్బు సినిమా కి జీకే చౌదరి కో-డైరెక్టర్ గా పని చేశారు. అయితే ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూ. ఎన్టీఆర్ ప్రతి ఒక్కరితో చాలా స్నేహపూర్వకంగా మెలిగే వారిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుబ్బు సినిమా సెట్స్ లో తనతో చాలా క్లోజ్ గా ఉండేవారని.. అదిచూసి తాను ధనవంతుడనని భావించి తన ఇంటి ఓనర్ రెండు వేల రూపాయలు అద్దె పెంచారని ఆయన నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ తనతో మాట్లాడుతూ.. "నేను పది సంవత్సరాల పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ లో హీరో గా కొనసాగి మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత పాలిటిక్స్ లోకి రంగప్రవేశం చేస్తాను," అనే చెప్పారని చౌదరి వెల్లడించారు.