తెలంగాణాలో ఎన్నికల సమరం జరుగుతోంది. ఈ రోజు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాజకీయ నాయకులంతా అక్కడే తిష్ట వేసినట్లుగా తెలుస్తోంది. దొరికిన ఏ ఒక అవకాశాన్ని వదలకుండా ఓటర్లను ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఓటర్లు ఎవరి పక్షాన నిలబడతారో తెలిసే సమయం ఆసన్నమైంది.