తెలంగాణ రాష్ట్రంలో పార్టీ స్థాపించి మళ్లీ రాజన్న రాజ్యం తీసుకు వస్తాను అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలు వైయస్ షర్మిల ప్రకటించడం సంచలనం కూడా మారిపోయింది. అయితే ఇటీవలే పార్టీ ప్రకటన తేదీని కూడా ప్రకటించారు వైయస్ షర్మిల. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున కొత్త పార్టీ పేరు ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్టీ ఏర్పాటుకు సంబంధించి అంతా సిద్ధం చేసుకుంటున్నారు వైయస్ షర్మిల. ఇక పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన వైయస్ షర్మిల