ఈ మందును అనవసరంగా వాడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. రెమ్డెసివిర్ కరోనా నివారణకు ముఖ్యమైన ముందు కాదని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. అది ఇప్పటికీ పరీక్షల దశలోనే ఉందని... తీవ్రమైన లక్షణాలున్న వారికి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వాడాలని ఆయన సూచించారు.