గతంలో స్పానిష్ ఫ్లూ వచ్చినపుడు తొలిదశలో కేవలం 30-50 లక్షల మంది మాత్రమే చనిపోయారు. అయితే.. కొంతకాలానికి స్పానిష్ ఫ్లూ తగ్గింది.. జనం అంతా సర్దుకుందన్న అపోహతో నిర్లక్ష్యం వహించారు. అంతే స్పానిష్ ఫ్లూ రెండోదశలో విజృంభించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏడు కోట్ల మంది వరకూ చనిపోయారు. ఇప్పుడు కూడా కరోనాను ప్రజలు నిర్లక్ష్యం చేస్తే ముప్పు తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.