దేశంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతుంది. రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య పెరుగుగుతుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటన రద్దయ్యింది. బ్రిటన్, భారత ప్రభుత్వాల తరఫున ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదలైంది. అయితే ఏప్రిల్-25 భారత పర్యటనకు బోరిస్ జాన్సన్ రావాల్సి ఉంది.