ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని ప్రముఖ ఆలయాలలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటి. ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు ఎప్పుడూ తరలివస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. సామాన్య ప్రజలే కాదు సంపన్నులు సైతం శ్రీవారిని దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా కాలంతో సంబంధం లేకుండా తిరుమల