ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు చేస్తున్న ఉద్యమం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకూ తమ ఉద్యమాన్ని విరమించేది లేదు అంటూ ప్రస్తుతం రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో రోజుల తరబడి ఉద్యమాన్ని చేపడుతున్నాయి. అయితే ఇక్కడే ప్రాణాలైనా వదిలేందుకు సిద్ధంగా ఉన్నాము కానీ అటు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు వెనక్కి తగ్గేది లేదు అని చెబుతున్నారు రైతు సంఘాల నేతలు. ఇక రాకేశ్ టికాయత్ ఆధ్వర్య