ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలలో వాయు కాలుష్యం కూడా ఒకటిగా పరిగణించవచ్చు. ఈ వాయు కాలుష్యం వలన అనేక రకాలుగా మానవులకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతే కాకుండా పర్యావరణం దెబ్బతింటుంది. మరియు వాతావరణంలోని ఓజోన్ పొర కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఎప్పటికప్పుడు వాతావరణ శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉంటారు.