ఆంధ్రప్రదేశ్లో కరోనా సెకండ్ వేవ్ రెచ్చిపోతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. ఫస్ట్ వేవ్ కంటే ఈ సారి సీరియస్ గా ఉంది పరిస్థితి.. కోవిడ్ పరిస్థితి రాష్ట్రంలో తీవ్రంగా ఉందని.. జిల్లా అధికారులను అప్రమత్తం చేశామని.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.