ప్రతిపక్ష నేతలని ఇబ్బంది పెడుతూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారా? అంటే ప్రతిపక్ష టీడీపీ నేతలు అదే అంటున్నారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్...కీలకమైన టీడీపీ నాయకులని టార్గెట్ చేసుకుని ముందుకెళుతున్నారు. ఊహించని విధంగా వారిపై కేసులు వచ్చి పడుతున్నాయి. కొందరిని అయితే జైలుకు కూడా పంపించేశారు. అయితే ఇదంతా జగన్ కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే జరుగుతుందని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు.