కరోనా...గత ఏడాది నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. అదుపులోకి వచ్చినట్లే వచ్చి, విజృంభిస్తున్న ఈ కరోనా మహమ్మారి దెబ్బకు భారతదేశం అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అలాగే మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఈ కరోనా ఏపీలో కూడా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. రోజుకు పదివేల పైనే కేసులు వస్తున్నాయి. అయితే కరోనా కట్టడిపై ఏపీ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేకపోవడం వల్లే, ఈ స్థాయిలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.