కరోనా కల్లోలం ఏపీలో బీభత్సం సృష్టిస్తుంది. ఎక్కువ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. నెల రోజులు క్రితం వరకు వందల్లో ఉండే కేసుల సంఖ్య ఇప్పుడు వేలల్లోకి చేరింది. ప్రతిరోజూ కరోనా కేసుల సంఖ్య 10 వేలకు టచ్ అయింది. అలాగే మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే ఈ కరోనా కల్లోలం ఏపీకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అదే పరిస్తితి ఉంది. పాలకులంతా కరోనా కట్టడి ఎలా చేయాలని ఆలోచనలో తలమునకలై ఉన్నారు.