మొన్నటివరకు ఏపీలో ఎన్నికల హడావిడి నడిచిన విషయం తెలిసిందే. ప్రజలు, నాయకులు అదే పనిలో బిజీగా ఉండిపోయారు. వరుసగా పంచాయితీ, మున్సిపల్, ఎంపిటిసి, జెడ్పిటిసి, తిరుపతి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల సమయంలో నాయకులు అంతా వీధుల్లోనే కనిపించారు. ప్రతి ఒక్కరూ ప్రజలని కలిశారు. తమ పార్టీని గెలిపించమంటే, తమ పార్టీని గెలిపించాలని నాయకులు ప్రచారం చేశారు.