ఏపీ టీడీపీలో దూకుడు స్వభావం కలిగిన నాయకులు చాలామందే ఉన్నారు. తమదైన శైలిలో మాట్లాడుతూ, ప్రత్యర్ధులకు చెక్ పెట్టగలిగే నేతల్లో పరిటాల శ్రీరామ్ కూడా ఒకరు. రాజకీయాల్లోకి రావడమే ఓటమితో మొదలుపెట్టిన శ్రీరామ్, ప్రస్తుతం టీడీపీలో కీలక నాయకుడు ఉన్నారు. తన తల్లి సునీత కాస్త రాజకీయాలకు దూరంగా ఉండటంతో శ్రీరామ్ మరింత దూకుడు పెంచారు. అయితే ఒకేసారి రెండు బాధ్యతలు వచ్చినా శ్రీరామ్ ఎక్కడా తగ్గడం లేదు.