దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ బాధితులతో ఆస్పత్రులు నిండుకుపోయాయి. వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప.. ఆస్పత్రికి రావొద్దని సలహా ఇస్తున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కరోనాను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు.