కరోనా వైరస్ నివారణ కొరకు తయారుచేసిన కొవాగ్జిన్ టీకా ధరలను భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే కొవాగ్జిన్ టీకా ధరలను తాము నిర్ణయించినట్టు వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.600 చొప్పున ఒక్కో డోసు విక్రయించనున్న భారత్ బయోటెక్.. ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం ఒక్కో డోసు రూ.1,200 లకు విక్రయించేందుకు నిర్ణయించింది.