ఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రోజుకు వేలమంది కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఊహించని విధంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన రాజకీయ పార్టీలు రాజకీయం చేయడం ఆపడం లేదు. అసలు రాజకీయం చేయనిదే బ్రతకలేము అనే విధంగా అధికార, ప్రతిపక్ష నేతలు ముందుకెళుతున్నారు.